ఒకసారి ఊహించండి... ఒక పెద్ద లగ్జరీ హోటల్ ప్రధాన ద్వారం హ్యాండిల్‌పై ఒక చిన్న పక్షి గూడు కట్టుకుంది!
అది మామూలు పక్షి కాదు, తేనెపిట్ట (Sunbird/Hummingbird). దీని గూడు ఒక గోల్ఫ్ బంతి పరిమాణం లోనే ఉంటుంది. మొక్కల పీచు, పాచి, సాలెగూడు దారాలతో కట్టడం వల్ల పిల్లలు పెరుగుతున్న కొద్దీ గూడు కాస్త సాగుతుంది.
దీన్ని గమనించిన హోటల్ సిబ్బంది గూడును పాడు చేయలేదు. దానికి బదులుగా ఆ తలుపు వైపు ఎవరూ వెళ్లకుండా అడ్డుగా నిల్చుని, వేరే మార్గం గుండా పంపించారు. తలుపుపై "నేచర్ ఇన్ ప్రోగ్రెస్" అని తమిళంలో రాసిన ఒక చిన్న కార్డు తగిలించారు.
ఈ పక్షుల్లో తల్లి పక్షి ఒక్కటే పిల్లలను చూస్తుంది. తేనె, చిన్న పురుగులను తీసుకురావడానికి రోజుకు చాలాసార్లు ఎగిరి వెళ్తుంది. గూడు చాలా నాజూకైంది; పదే పదే భంగం కలిగితే తల్లి పక్షి గూడును వదిలేసి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. అందుకే ప్రశాంతమైన వాతావరణం దొరకడం, పిల్లలు ఎదిగి ఎగిరిపోయే వరకు ఎంతగానో తోడ్పడింది.
కొద్ది గ్రాముల బరువు మాత్రమే ఉన్న ఒక చిన్న ప్రాణి కోసం అంత పెద్ద హోటల్ తన సదుపాయాన్ని పక్కన పెట్టడం చాలామందిని ఆకట్టుకుంది. అవకాశం కంటే ప్రాణమే గొప్పదని వారు చేతల్లో చూపించారు.
తమిళం ఆధారంగా రాసిన విషయమిది. మూల రచయిత టి. మాధవన్. ఆయనకు కృతజ్ఞతలు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి