మనకు మనం..!!!: - డా ప్రతాప్ కౌటిళ్యా.


పచ్చని చిగురులా 
కురిసే వాన చినుకులా 
కరిగే చల్లని మంచులా 
జారే జలపాతంలా.....!!

ఉరిమే ఉరుములా
మెరిసే మెరుపులా 
విరిసే ఇంద్రధనస్సులా
సంధ్య పొద్దులా.....!!

పూసే పూవ్వులా
సుగంధ పరిమళంలా
పండు వెన్నెల లా
ఉషాకిరణంలా...!!!

గుండె లయలా
సహజమైన శ్వాసలా
ముందు మనకు మనం 
చివరికి మనకు మనం..!!

మనకు మనం నచ్చం 
మన తోడు మనకు నచ్చదు 
మనతో మనం ఉండం 
మన అంతరాత్మ మనకు గురువు. 

మనల్ని మనం ప్రేమించుకోవాలి 
మన తోడు మనకు నచ్చాలి 
మనతో మనం గడపాలి 
మన అంతరాత్మనే మనకు గురువు. 

గుండె లయలా 
సహజమైన శ్వాసలా
ముందు మనకు మనం 
చివరికి మనకు మనం...!!
------------------------------------
డా ప్రతాప్ కౌటిళ్యా.
కామెంట్‌లు