--పాఠశాల పిల్లలకు బెల్టులు పంపిణీ
ప్రభుత్వ పాఠశాలల్లోనే సకల విద్యా సౌకర్యాలున్నాయనిఅలాగే నాణ్యమైన విద్యను అందిస్తున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కాల్వశ్రీరాంపూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ కోరారు. గురువారం ఆయన ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. ప్రభుత్వం అందజేసిన ఉచిత బెల్టులను ఆయన ఉపాధ్యాయులతో కలిసి పిల్లలకు అందజేశారు.
ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విశేష బోధనానుభవం కలిగిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు చదువులో పిల్లల్ని అద్భుతంగా తయారు చేస్తున్నారన్నారు. పాఠశాల పిల్లలు వారి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న సౌకర్యాలను ఇతరులకు తెలియజేయాలని ఆయన కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులు, అంకిత భావంతో పని చేస్తున్న టీచర్లు ఉన్నారని, గ్రామ ప్రజలు, పిల్లల తల్లిదండ్రులు వారి సేవలను వినియోగించుకోవాలని వెంకటేష్ కోరారు. అనంతరం ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు స్వీకరించిన సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులతో కలిసి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. విద్యారంగంలో వెంకటేష్ చేస్తున్న విశేష సేవలను ఈర్ల సమ్మయ్య కొనియాడారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు వెంకటేష్ చక్కటి పరిపాలనాదక్షుడని, అలాగే మంచి సబ్జెక్టు టీచర్ ఆయన మున్ముందు మరెన్నో అవార్డులు పొందాలని ఈర్ల సమ్మయ్య ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేస్తున్నామని, పాఠశాల పిల్లలకు నూతన సాంకేతిక పరిజ్ఞానంతో విద్యను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి