గొంగడి :- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -సెయింట్ లూయిస్-అమెరికా


 బాల్యంలో  పల్లెలో
శరదృతువు నుంచి మొదలైన
చల్లటి చలిని తట్టుకునేందుకు
తాతయ్య గొర్రెలనుంచి  తీసే 
బొచ్చుతో తానే స్వయంగా తయారుచేసిన
గొంగడి అనే వస్త్రాన్ని తనతో బాటు 
నాకు తమ్ముడికి ఇచ్చినది 
ప్రాతః కాలపు చీకటిలో
పచ్చటి పొలాలమధ్య
ఇంటి ముందర మంటవేసి
గొంగడితో కప్పుకు వెచ్చని చలిమంటను కాచుకున్నది 
జీవితాన మరువలేనిది
కర్రపట్టుకు భుజంపై గొంగడి కప్పుకు పశువులను తోలే  తాతయ్య తో
మేము వెళ్ళడం 
రాత్రి సమయంలో గొంగడి కప్పుకు నులకమంచం పై పడుకుని 
పండిన పంట పరులపాలవకుండా కాపాడుటకు
కుక్కతో, లాంతరు పెట్టుకు
పాకలో పడుకోవటం
పంట కాలవుల లోకి
యాతం తో నీటిని బావిలోంచి తోడి వేయడం 
ఎన్నని ఏమని చెప్పను 
చలిని దూరం చేసే గొంగడి 
సంస్కృతికి ప్రతీకయే...!
............................
కామెంట్‌లు