కానీ మనం పైకి ఎక్కడం వల్ల కాదా..
లేదా మనం మెట్టు మెట్టు పైకి ఎక్కడం వల్ల
పైకి చేరుకుంటామా...!!?
మట్టి పైకి ఎత్తడం వల్ల విత్తనం మొలకెత్తుతుందా
లేక విత్తనం మొలకెత్తడం వల్ల మట్టి తొలగుతుందా..!!?
చీకటి తొలగడం వల్ల వెలుగొస్తుందా లేక
వెలుగు రావడం వల్ల చీకటి తొలుగుతుందా..!!?
మనం ఏదైనా నేర్చుకోవడం వల్ల జ్ఞాపకం వస్తుందా
జ్ఞాపకం వల్ల మనం ఏదైనా నేర్చుకుంటామా....!?
నడవడం వల్ల నడక నేర్చుకుంటామా
నేర్చుకోవటం వల్ల నడక వస్తుందా......!?
వినడం వల్ల మాటలు వస్తాయా
మాట్లాడడం వల్ల మాటలు వస్తాయా..!!?
మైండ్ వల్ల బాడీ పనిచేస్తుందా లేదా
బాడి వల్ల మైండ్ పనిచేస్తుందా.......!!?
చెట్టులో నీరు మనిషిలో రక్తం ఒకటేనా
నీరు ఎక్కువ రక్తం తక్కువ ఎందువల్ల..!!?
ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఉన్నాయి
ప్రశ్నించడం రావాలి ప్రయత్నించడం రావాలి..!!
===================================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి