గులాబీ బాల గుసగుసగా కబుర్లు ఎన్నో చెప్పింది!
మల్లె పందిరి భానుడి కిరణాలకు గొడుగై నిలిచింది!
జాజిపువ్వు కిటికీలోంచి చూస్తూ కొంటెగా కన్ను గీటింది!
ప్రతినిత్యం ఒక క్రొత్త పరిమళపు పులకరింత!
కోయిలమ్మ గొంతులో రాగాల పుంత!
నీళ్ళు తోడుతూ గిలక శబ్దాలు!
చేద బావి వద్ద చలిలో స్నానాలు!
ఉదయాన్నే దినకరుడికి ఆదిత్య స్తోత్రాలు!
ఆరోగ్యాన్ని అందించే సూర్య నమస్కారాలు!
నులక మంచం పై పెట్టిన వడియాలు!
కాకులు ఎత్తుకుపోయిన చెంచాలు!
జిహ్వ మరచిపోని గుమ్మపాలు!
నానమ్మ తినిపించిన గోరుముద్దలు!
మా పెరటి జ్ఞాపకాలు!
నా మదిలో చేసెను మధుర సంతకాలు!
#################################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి