ఉద్యమించి భరత మాత దాస్య శృంఖలాలను విడిపించిన మహాత్మాగాంధీ.
విప్లవం వర్ధిల్లాలి అంటు వన్యప్రజలకు ప్రేరణనిచ్చి
తెల్ల దొరలకు సింహస్వప్నమై
బుల్లెట్లకు అసువులు బాసిన అల్లూరి.
తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి
ఆమరణ నిరాహార దీక్ష చేసిన
అమరజీవి పొట్టి శ్రీరాములు .
పర్యావరణ పరిరక్షణకు చిప్కో ఉద్యమంతో
వృక్షో రక్షతి రక్షితః అనే నినాదంతో
పోరాడిన సుందర్ లాల్ బహుగుణ మేథాపాట్కర్ .
కార్య సాధనకు ఉద్యమమే సాధనం
హక్కుల కోసం పోరాటం
అవినీతి,అరాచకాలను దూరం చేయడానికి
సత్కార్య సాధనకు ఉద్యమమే ఆయుధం..!
.................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి