విద్యారంగంలో వినూత్న బోధనా విధానాలు, తెలుగు భాషాభివృద్ధికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా తెలంగాణ ఆదర్శ పాఠశాల, వల్లాల (శాలిగౌరారం మండలం, నల్గొండ జిల్లా) తెలుగు ఉపాధ్యాయులు కుక్కడపు శ్రీనివాసు ప్రతిష్ఠాత్మక INNOVATION TEACHER AWARDS– ITA 2026 అవార్డును ఈరోజు స్వీకరించారు.
హైదరాబాద్‌లోని హరిహర కళాభవన్ వేదికగా జఠాధర ఎడ్యుకేషన్ టెక్నాలజీ (JET) యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన INNOVATION TEACHER AWARDS– ITA 2026 అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గౌరవ ముఖ్య అతిథి తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి , తెలంగాణ మోడల్ స్కూల్స్ AMO శ్రీమతి మంజరీ చేతుల మీదుగా ఈ అవార్డును ప్రదానం చేశారు.
తెలుగు భాష బోధనలో సృజనాత్మక పద్ధతులు, సాంకేతికత వినియోగం, విద్యార్థుల్లో భాషా నైపుణ్యాల పెంపు, పాఠశాల స్థాయిలో చేపట్టిన వినూత్న కార్యక్రమాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించడం విశేషంగా నిలిచింది.
ఈ సందర్భంగా వల్లాల ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు మరియు విద్యారంగ ప్రముఖులు శ్రీ కుక్కడపు శ్రీనివాసు గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి