సాహిత్య పరిమళాలు : - అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి)-సెయింట్ లూయిస్ -అమెరికా

 

 సాహిత్యం సమాజ హితం కావాలి 
వేమన సుమతీ శతక పద్యాల జీవిత సత్యాల పరిమళం 
పోతన భాగవత పద్యాల  రసరమ్య గుళికలు 
గురజాడ వారి పుత్తడి బొమ్మ పూర్ణమ్మ 
విశ్వనాథ వారి కిన్నెరసాని
నండూరి వారి వెంకి పాటల తీయదనం 
ఆదిభట్ల నారాయణ దాసు హరికథ
కాళిదాసు అలంకార ప్రక్రియ 
శ్రీనాథుని నుంచి  శ్రీశ్రీ వరకు 
రామాయణ భారత కావ్యాల ఆదర్శ జీవన సూత్రాలు 
కవితలు, కథలు పద్య గద్య పరిమళాలు
గ్రామీణ జానపదాలు ఒగ్గు కథలు 
ఎన్నని ఏమని చెప్పను ఏ  సాహిత్య ప్రక్రియ అయినా 
సమాజ హితమై హృదయ స్పందన కలిగించేది 
శాశ్వతమైనదే 
శ్రీ శ్రీ చెప్పినట్లు ఛందోబద్ధం కానక్కరలేదు కవిత్వం 
పాఠకుల హృదయ స్పందన కలిగించేది కవిత్వమన్నది
అక్షర సత్యం...!!
............................. 

కామెంట్‌లు