పారిజాతాలు
రేయి నింగిన మెరిసిన
రాలిన చుక్కలు!
కలలు రానివ్వని
కలత నిండిన మదిని
అలజడి రేపిన
అలవి కాని తలపులు!
వెడుతూ వెడుతూ
వెనుకకు తిరిగి వచ్చి
వెలితి తీర్చాలని రాల్చిన
వెన్నెల పువ్వులు!
ఎదురుచూపులు
ఎవరికోసమో వారే
ఎదురు నిలిచి నవ్విన
ఎనలేని నవ్వులు!
దాచుకున్న పరిమళాలు
దారంతా పరిచేసి
దోచుకోబడ్డ సంపదలా
దోసిలి నింపే సంతోషాలు!
వేగుచుక్క పొడవగానే
వెడలే వెలుగుల తేరుకు
వేలాడే తళుకు తారలల్లే
వేకువకు హారతి పట్టే కర్పూరాలు!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి