సామెత -349 : ఇసుక బాయి తొవ్వడు ఎవరి వశం
****
"అయిన గాని అవ్వా!" కొంతమందిరి శెప్పితే యినరు.వాళ్ళ వొంట బుట్టదు ఎందుకంటవ్? గిదైతది గది కాదు అని గాళ్ళ మన్సులకి తెల్వదా? తల్కాయల గింతన్న యిశారిచ్చరా? గాళ్ళ దిమాక్ ఏమన్న కరాబైందా ."
"గంత పెద్ద పెద్ద మాటలు అనబడ్తివి ఎవల్ని ?ఎవల్నేం అనేతట్టు లేదు శెల్లే? పతోడు నా అంత తెల్వి తేటలున్నోడు గీ జిందగీలనే లేడు అన్నట్టు శేత్తుండు. ఏదన్న మంచి శెబర శెప్పబోతె నువ్వేంది నాకు శెప్పేది అన్నట్టు గుర్కాయిచ్చి సూత్తుండు. గస్మంటి మడిషికి మనమేం జెప్తం శెల్లే. నువ్వు శెప్పేది సుత గా బాపతేనా?"
"అవునవ్వా! నేను సుత శెప్పేది గదే కత. మన మల్లేశం మావఁ కొడుకు ఈరేశం ఉండు గద. గాని యిష్యం మల్లేశం మావఁ,అత్త నెత్తి నోరు గొట్టుకుంట శెప్పుకుర్రు.గాడు అస్సలు శెప్పిన మాట యినకుండ గిప్పటికే గా యాపారం గీ యాపారం అన్కుంట లచ్చలు లచ్చలు పోగొట్టిండంట. గిప్పుడేమో రియలెట్టేటు యాపారం జేత్త.నా దోత్తుగాళ్ళు గందుల్ల పొత్తు గల్వమన్నరు గా పదెకరాలు అమ్ముతవా సత్తవా అని మెడకాయ మీద కత్తొతికె కూసుండంట.ఇంట్లె దినాం పంచాతేనట.యియ్యక పోతే సత్తనని బెదిరిత్తుండట. గదేదో నీ శెవుల బడేద్దమని వొచ్చినవ్వా!"
"అవును శెల్లే! గా ఈరేశం గాడు శిన్నతనం కానిచ్చి తెలుసు.గాని తెల్వే గంతంత మాత్తరం పదిల పదో త్యేప గట్టెక్కిండు.గా లెక్కల్ల రెండు మూళ్ళ ఎంతరా అంటే గిప్పటికి శెప్పేతందుకు తనుకులాడ్తడు.గాడేం యాపారం శేత్తడు.సరుకుల దుకుణమని గవీటిని ఎట్ల అమ్మాల్నో తెల్వక పైసలు ఆగం జేసే.పండ్ల దుకుణమని గవీటిని అమ్మ శేత గాక పండ్లన్ని కుల్ల బెట్టి లాచారయ్యిండా.ఇంగ అమ్మ నాయినల నెత్తిన గుడ్డేసుడు సాల్లేదటనా.ఉన్న గా పొలం అమ్మితే కూలోల్ల అవతారమెత్తుడే శెల్లే! మల్లేశం మావఁని యియ్యొద్దని శెప్పు. గిట్ల ఎక్కడికక్కడ పోగొట్టేటోడు రేప్పొద్దున నాలుగు పైసలు సంపాయిత్తడని ఏ కోశానా లేదు."
"గదే అవ్వా! ఎంత శెప్పినా యింటల్లేడట.గీ పాలి లాబం తెచ్చి సూపుత నన్ను నమ్ముర్రి.గట్ల మొత్తమిచ్చుడు యిట్టపడక పోతే నా పాలుకు ఎంతొత్తదో గంత యియ్యుర్రి అని శికాకు శేత్తుండంట అవ్వా!"
"అదృట్ట వంతున్ని శెడగొట్టలేం- దరిద్దున్ని బాగు శెయ్యలేం' ఏం జేత్తం గాడు సేశే పని యిసుకల బాయి తొవ్వుడే.గది నిలుత్తదా.అందుట్ల నీళ్ళు శేదుకునుడు అయితదా శెల్లే! గాని వొల్లగాని పని శేత్తనని మొండికేత్తుండు.ఎవని అయిషతు గానికి దెల్వదా? శెప్పుడు మాటలిని శెడిపోవుడంటే గిదే."
**
"గదే అవ్వా! ఈరేశం గాని కత తెల్శిందా? నువ్వన్నదే సుబూది అయ్యిందవ్వా! గాని దోత్తు గాళ్ళు ఏవేవో టాంపు కాయితాల మీద సంతకాలు జేయిచ్చిర్రట.మశిబూశి మారేడు గాయ జేసి మొత్తం ఐదెకరాల బూవి పొతం బట్టిచ్చిర్రు.గిప్పుడు గీని యవ్వారం నువ్వన్నట్టు యిసుకల బాయి తొవ్వుడే అయ్యింది. అంత పోగొట్కొని తల్కాయ నేలకేస్కొని వొచ్చిండట."
"గదే శెల్లే మనం వల్ల గాని పన్లకి అస్సలు బోవొద్దు.బోతే పైసలైన పనులైన గిట్లనే ఆగమైతయి."ఇసుక బాయి తొవ్వుడు ఎవలి వశమైతది" శెప్పు.అలివి గాని పన్లకి బొయ్యి ఎల్లెల్కల బడుడే అయితది.గిప్పుడు ఈరేశం గాని పని గట్లనే అయ్యింది గద."
"అవునవ్వా! నువ్వు శెప్పేది అచ్చరాల నిజ్జం."
గదండీ సంగతి" "ఇసుక బాయి తొవ్వుడు ఎవరి వశం" అంటే గిదే మరి. మన అయిషతు,అలివి గాని పన్లు మొదలు వెడ్తే ఎస్మంటి పాయిదా వుండదని శెప్పేతందుకు గిస్మంటి శాత్రం శెప్పి మన పెద్దోళ్ళు యెచ్చరిత్తుంటరు."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి