తికమక మకతిక!: - కొత్త విరిత
 

మనసు బిజీ అయితే… మాటలకు కూడా ట్రాఫిక్ జామ్ ఉంటుంది
మనసు పది పనుల్లో బిజీగా ఉంటే… నోటి నుంచి వచ్చే మాటలకు మాత్రం అప్పుడప్పుడు ఎలాంటి రూల్స్ ఉండవు! 
“హార్లిక్స్ నిండా గ్లాస్ తాగావా?” అంటే  "హార్లిక్స్ తాగావా, గ్లాస్ నిండా?"ఇది అర్ధం కావాలంటే ఒక కప్ టీ తాగాల్సిందే.
“టికెట్ల మీద క్రెడిట్ కార్డు తీసుకో” అంటే… "టికెట్ కొనాలా, క్రెడిట్ కార్డు వాడు"…ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేపితే సినిమా ఎలా చూస్తారు?
“ఉప్పులో కూర వేశావా?” అంటే కూర కమ్మగా రావాలని ఆత్రపు ప్రశ్న!
ఇవి తప్పులు కావు, మనసు ముందుకెళ్లిపోయి, మాటలు వెనుకపడిపోయిన సందర్భాలు.
మెదడు ఒకేసారి పది విషయాలు ఆలోచిస్తుంటే, నాలుక మాత్రం వాటిని గజిబిజి చేస్తుంది.
అందుకే కొన్నిసార్లు మనం చెప్పింది మనకే అర్థం కాదు… ఎదుటివాళ్లకు అర్థం కాకపోవటంలో వింత ఏముంది.కాబట్టి ఎవరో ఇలా తికమకగా మాట్లాడితే వెంటనే “ఏంటి నీ తెలుగు?” అనకుండా.. “అసలు నీ మైండ్ లో ప్రస్తుతం ఎన్ని టాబ్స్ ఓపెన్ ఉన్నాయి?” అని అడిగి నవ్వేయండి
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻
అజ్ఞాత చెప్పారు…
Excellent 👌👌👌