పల్లెటూరి రమణీయం!: - పాలగుమ్మి జ్యోతి.

 

గలగల పారెను నీరు 
చేనున నాటెను వరి నారు 
పెరిగెను ఏపుగ పచ్చని పైరు 
సిరి సంపదలతో అలరారు!!

పండిన వరి కంకులు 
గాలికి ఊపెను తలలు 
తినగ చేరెను పిట్టలు 
వెలసెను దిష్టి బొమ్మలు!!

బారులు తీరిన బాతులు 
కొంగల దొంగ జపాలు
పిల్లల ఈతల పోటీలు
పిల్ల కాలువలో దృశ్యాలు!!

రచ్చబండపై చేరెను జనులు 
చతుర్ముఖ పారాయణాలు 
వచ్చి తరిమెను మామలు 
దొరకక తీసెను పరుగులు!! 

కామెంట్‌లు