నరసరావు పేటలో గుఱ్ఱము జాషువా జయంతి వేడుకలు జాతీయ కవి సమ్మేళనం
 


తిరుపతి జిల్లా భాకరాపేట వారి ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ,  తెలుగు కళా రత్నాలు సాంస్కృతిక సేవా సంస్థ విజయవాడ వారి నిర్వహణలో మహాకవి గుర్రము జాషువా జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా నరసరావు పేటలో సెప్టెంబర్ 27న 
వడ్డెర కళ్యాణ మండపం పెద్దచెరువు వద్ద విభిన్న రంగాలకు చెందిన జానపద  కళాకారులను గుర్తించి జానపద రంగస్థల నృత్య సంబరాలు నిర్వహణ చేస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు డా. యు. వి రత్నo మేనేజింగ్ డైరెక్టర్ డా. ధనాశి ఉషారాణి జాతీయ అధ్యక్షురాలు తెలియజేశారు. కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా *డా. శ్రీ చదలవాడ అరవిందబాబుగారు శాసనసభ సభ్యులు నరసరావు పేట వారు కార్యక్రమంలో కవులు కళాకారులకు గుర్రము జాషువా పురస్కారం నాట్య రవళి పురస్కారం సర్టిఫికెట్ శాలువాతో సత్కరించనున్నారు. కార్యక్రమంకు 100 మంది పైగా పాల్గొననున్నారనీ  రంగస్థల సంప్రదాయం నృత్య ప్రదర్శనలుతో కార్యక్రమం జనరంజకంగా సాగనున్నదనీ పోగ్రామ్ డైరెక్ట్ డా. ధనాశి ఉషారాణి తెలియాజేశారు. కార్యక్రమంలో శ్రీ వంకాయల పాటి రవి అడ్వకేట్ నరసరావుపేట స్వర్ణ చినరామిరెడ్డి అసిస్టెంట్ రిజిస్టార్ కోపరేట్ డిపార్టెంట్ వేల్పుల మోషే  అడ్వకేట్  శ్రీమతి వంగర మహాలక్ష్మి డ్యాన్స్ మాస్టారు.లాంటి పెద్దలు ముఖ్య అతిథిలుగా విచ్చేయనున్నారు.
కామెంట్‌లు