డా. ధనాశి ఉషారాణికి ఆదికవి నన్నయ్య విశిష్ట రచయిత్రి పురస్కారం
 

తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి నూతన ప్రక్రియల రూపకర్త డా. ధనాశి ఉషారాణికి సాహిత్యంలో విభిన్న ప్రక్రియలు సృష్టించి నూతన చందస్సుతో పుస్తకాలు తీసుకొస్తునే అనేక సాహితీ ప్రముఖులు పేరుతోనూ  అవార్డులను అందించే పరంపరలో వందల సంఖ్యలో సాహితీ సభలు  ఆన్లైన్ పోటీలు చేపట్టినందుకు ఆదికవినన్నయ ఉత్తమ రచయిత్రి పురస్కారం నెల్లూరులోని ఆర్ టి సి బస్టాండ్ వద్ద గల కల్యాణ మండపంలో సెప్టెంబర్ 6 తేదీ ఆదివారం పురస్కారం అందుకున్నారు. కవితా వాణిని గంభీరంగాను తెలుగు భాషలో కవిత్వంను కథానికలును ఆకాశవాణిలో వినిపిస్తూ అలుపెరుగని సాహితీ కార్యక్రమంలతో ముందుకు వెళుతున్న డా. ధనాశి ఉషారాణి సేవలుకు గుర్తింపుగా ఎo వి రావు ఫౌండేషన్ చైర్మన్ యం లీలా మోహన్ కృష్ణ గారు అవార్డును నెల్లూరులో  అందించారు .200 మంది కవులు కళాకారులు మధ్యలో పురస్కారం అనుకున్నారు. తెలుగు భాష ఉన్నతికి
 నిరంతరం కృషిచేయడానికి మరింత ఉత్సాహంను ఇస్తుందని  డా.ధనాశి ఉషారాణి సంతోషము  వ్యక్తము చేశారు.
కామెంట్‌లు