శ్రీకృష్ణా!:- పద్మ త్రిపురారి.-జనగామ.


పల్లవి::
చల్లని మనసు 
పిల్లన గ్రోవి 
నల్లనివాడా! శ్రీకృష్ణా!
అల్లన మెల్లన 
పల్లెను చేరి 
అల్లరి చేసే యదు కృష్ణా!
        
        "చల్లని"

చరణం::
మోమున నగవు 
నుదుటన తిలకం 
అందము చిందే శ్రీకృష్ణా!
వెన్నలు దోచి 
వన్నెలు చూపిన 
సుందర వదనా 
యదు కృష్ణా!
      "చల్లని"

చరణం::
వసుదేవకి నందన
నందము మాకిడ 
అందాలొలుకుతు రావయ్యా!
యశోద నందన 
వందననమిడుదుము 
అందెళ రవళితో రావయ్యా.
   "చల్లని"

చరణం::
బృందావనిలో హృదయము నిండగ 
వేణువులూదిన శ్రీకృష్ణా!
నీకై వేచిన రాధా గోపిక 
ఎదను చేరిన యదు కృష్ణా!
సత్యా రుక్మిణి 
ప్రేమకు రూపం 
నీవై వెలిగిన శ్రీకృష్ణా!
ఇష్ట సఖుడవై 
కుచేలుని కష్టము 
దూరము చేసిన యదు కృష్ణా!

చరణం::
దుష్ట కంసుని శిరమును తెంపి 
ధీరత చాటిన శ్రీకృష్ణా!
కాళీయ మర్ధన!
గిరిధారివై నీవై 
గోవుల కాచిన యదు కృష్ణా!
గోపబాలకుల ప్రియ నేస్తము నీవై 
జగములనేలిన యదు కృష్ణా!
చక్రధారివై విశ్వము నిండిన 
వేలుపు నీవే యదుకృష్ణా!
     "చల్లని"


కామెంట్‌లు