సాధారణంగా ఆలయాలలో శివలింగానికి పాలాభిషేకం వృథాగా మురుగునీటిలోకి వెళ్తుంది. కానీ, ఈ పుణ్యక్షేత్రంలో అభిషేకం చేసిన పాలు ఒక ప్రత్యేక గొట్టం ద్వారా పాత్రలో సేకరించి, బయట ఆకలితో ఉన్న వీధి కుక్కలకు ఆహారంగా అందిస్తుంటారు.
భక్తి, జీవకారుణ్యం ఆహారం వృథా కాకుండా ఆపడం అనే ఈ తెలివైన పని, దైవారాధన అసలు ఉద్దేశాన్ని తెలియజేసేలా ఉంది. మూగజీవాల ఆకలి తీరుస్తున్న ఈ ఆలయ నిర్వహణ తీరుకు ప్రశంసలు లభిస్తున్నాయి
సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా షేర్ అవుతున్న ఈ హృదయాలను హత్తుకునే సంఘటన, నేపాల్‌లోని ప్రపంచ ప్రసిద్ధ పశుపతినాథ్ ఆలయంలోని దృశ్యాలే.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి