ఆయన ఊగుతూ ఉంటే రాగాలాపన చేస్తూ..
ఎన్నో సమస్యలను వింది!
సంతోష వార్తలూ వింది!
తాతయ్యను పెళ్ళి పెద్దగా చేసి..
ఊళ్ళో ఆడపడుచుల సంబంధాలు కుదిరిస్తే వింది!
తానూ ఆ మాటల్లో పాలుపంచుకుంది!
సమస్యలను పరిష్కరిస్తూ.
సంతోషంలో భాగమవుతూ..
అరుగు మీద నిండుదనం తెస్తూ..
ఇంటికే హుందాతనం ఇస్తూ..
పాలేరులతో పంటలకు వేసే ఎరువులు!
ఆ ఏడు దిగుబడులకు తీసుకోవలసిన జాగ్రత్తలు!
మనవళ్ళతో తాతయ్య ఆడిన ఆటలు!
దళారీలతో ధాన్యానికి చేసిన బేరసారాలు!
ఎప్పుడూ.. తాతయ్యను అంటిపెట్టుకున్న నేస్తం!
తాతయ్య పార్థివదేహం చూచి మూగగా రోదించిన వైనం!
ఆ దర్జా... ఆ తేజస్సు కొరవడి అయ్యింది నిస్తేజం!
మునుపటి వైభవం కోల్పోయింది!
తాతయ్య వాలుకుర్చీ మూగబోయింది!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి