సామెత -341: ఇచ్చేటప్పుడు కాముని పండుగ - పుచ్చుకునేటప్పుడు వినాయక చవితి
**
"అవ్వా! గాడు గింతన్నేలం జేస్తడనుకోలే. తినీ తినక కడుపుగట్టుకొని కూడ బెట్టుకున్న. దాశి దాశి దెయ్యాల పాలు జేశినట్టయ్యింది. ఎట్ల ఏం జేద్దును. నీ మర్దికి తెలిత్తే" ఆడపెత్తనం తంబళ్ల దొర్తనం" అని మొగుడికి శెప్పకుండ శేత్తావ్ అని ఎన్ని మాటలంటడో.. తల్సుకుంటెనే పెయ్యంత గజ్జున వొణుకుతుందవ్వా!"
"ఏంది శెల్లే! పెయ్యంత గా శెమట్లేంది.ఏందో బెహోష్ అయ్యేతట్టున్నవ్. ఇగ్గో గీ టూలు మీద కూసో.గీ కుండల నీళ్ళు సల్లగున్నయ్. గిన్ని నోట్లె బోస్కో. గిన్ని నీళ్ళు శేతిల బోస్కొని గా తూపరాశి కాడ మొకం కడుక్కొని పైటతో తుడ్సుకొని కూసుందువురా! ఇంగ జెప్పు ఏవైఁంది! ఏంది గంత పరేషాన్ గున్నవ్. అంతా మంచే గద?"
"ఏం మంచవ్వా? కడుపు సించుకుంటే కాళ్ళ మీద పడేతట్టుంది.ఏం జెప్పను? నమ్మి నానబోత్తె పుచ్చి బుర్రలైనట్టుంది నా పని. గా ఇస్తారి గాడు గిట్ల జేత్తడనుకోలే.ఎంతగనం నమ్మిచ్చిండో...అక్కా నువ్వెంత కట్టపడ్తున్నవో తెల్వదా అన్నడు.శీమ కూడేశినట్టు కూడేత్తున్నవ్ పిల్లగాండ్ల కోస్రం అన్నడు. శివరాకరికి నన్ను గిట్ల ఏడిపిత్తడనుకోలె."
" శెల్లే! గింతకి ఎంతిచ్చినవేంది? గిదే మొదగాల మునుపు ఇచ్చినవా?"
" అవ్వా! అప్పుడప్పుడు పదో ఇరవయ్యో ఏలు తీస్కోని మూడ్రూపయిల మిత్తి గట్టి అక్కా బావకి దెల్వకుండ గండం గట్టెక్కిచ్చివ్ ఆడివిల్ల కట్టం ఉంచుకుంటనా ఇగ్గో గిట్ల పువ్వుల్ల బెట్టి ఇత్తన్న పటని ఇచ్చేటోడు.గట్ల శానా త్యేపల యిచ్చినవ్వా! యాడాది కింద ఓ దినం వొచ్చి "పేటల పిలాటు గొంటున్న రొండు లచ్చలు తక్వబడ్డయి.వొచ్చేటియి యింక రాలె.ఎప్పట్లెక్కనే గదే మిత్తి గట్టి యిత్త అన్నడు.గిన్ని త్యేపల తీస్కొని యిచ్చిండు.గివ్వెందుకు యియ్యడు.మల్ల మూడ్రూపాయిల మిత్తి యాడొత్తయి, ఎవలిత్తరు గింత నమ్మకంగ అన్కుంట నా తాన ఉన్న లచ్చ, పక్కనున్న శెంద్రక్క నడిగి వోలచ్చ తెచ్చి శేతుల బెట్టిన."
అయ్యో అవునా శెల్లే! గా శెంద్రమ్మ ఊకునే మడిషి గాదే.బాగనే గిన్నాళ్ళు ఆగింది."
" ఎక్కడాగుడవ్వా! ఇచ్చిన మూడొద్దుల కానించి ఎప్పుడిత్తవ్ అని ఇంటికి ఆసువోసినట్టు తిర్గబట్టింది. మీ మర్దికి గిద్దెలిత్తే ఇంగేమన్నుందా అన్కుంట సైన్మా అన్కుంట పేటకి బొయ్యి బియాంకుల శేతి గాజులు కుద్వబెట్టి లచ్చ దెచ్చి శెంద్రక్కకి ఇచ్చిన. గట్లనే గస్మంటి గిలేటి గాజులు కొనుక్కుని ఏస్కోబట్టిన. గయ్యి బడక శేతులు నల్లవడి గోకుడు వెడ్తే తీశిన. మీ మర్ది పశిగట్టి అడ్గుతడేమోనని నిత్తెం బయానికి వొన్కి సత్తున్నవ్వా!"
"అయ్యో! గింతదనుక నాకు శెప్పకనే వోతివి.గీ నడ్మల ఇంతకి మున్పోలె వత్తుండా! వొత్తె గట్టిగ అడ్గక పోయినవ్ శెల్లే! "
"ఏడవ్వా! ఇచ్చిన కొత్తల్ల నన్ను ములకశెట్టు ఎక్కిచ్చిండు.సొంతక్క సుత గింత సాయం జెయ్యలే నువ్వు జేసినవ్. వొచ్చేటియున్నయి ఇత్త అన్కుంట రాన్రానూ వొచ్చుడు తగ్గిచ్చిండు.ఆర్నెల్ల కిత్తనన్నోడు యాడాది దాటింది.గాడు మొగం సాటేశిండవ్వా! "
" అయ్యో శెల్లే! గాడు అడగంగనే కాముని పండుగ జేస్కున్నంత సంబురంగ యిచ్చినవ్ .గిప్పుడు తీస్కునే కాడికి వొచ్చేతల్కి యినాయక సవితి లెక్క అయ్యిందన్న మాట!"
" అవ్వా! నువ్వు శెప్పేది తల్కాయలకి ఎక్కట్లే.ఏం సమజవ్వలే మల్ల జెప్పవ్వా!"
" గదే శెల్లే ఇచ్చేతప్పుడు కాముని పండుగ.అంటె తెల్సుగద గా పండుగ వొంటినిండ రంగులు జల్లుకుంట ఎంత సంబురంగ జేస్కుంటమో. గట్ల సంబురంగ యిచ్చినవ్. గిప్పుడు నీయి నువ్వు అడుగుడు యినాయిక సవితి లెక్క అయ్యింది.అంటే గా బొజ్జ గణపయ్యని ఏం కోర్తం."అయ్యా మాకేం కట్టాలు నట్టాలు ఆటంకాలు రానియ్యకు.నువ్వు తల్సుకుంటే గస్మంటివి రావు" అని బతిలాడ్తం గద.గట్లైంది నీ పని. బండకింద శెయ్యి బడ్డది శెల్లె వొడుపుగ తీస్కోవాలి.వొడుపు దప్పితే శెయ్యి నలుగుద్ది. గందుకే గాన్ని గల్శి శేతులు బట్కొని బతిలాడాలె."
" గవ్వీటికి పత్తరం గిత్తరం రాత కోతలు సుత లేక పాయె.గట్టిగ నిలదీశి వొసూలు శెయ్యడానికి.గందుకే గిస్మంటి పైసల యవ్వారానికి సాటుండొద్దు శెల్లే.గిట్ల నీలెక్క లచ్చలు లచ్చలు మోసబొయిన అమ్మలక్కలు శానా మందిరే ఉండ్రు. టీవీల పేపల్ల సుత పడ్తనే వున్నయి.రంది శెయ్యమాకు.నేను సుత గాడిని నిలదీత్త గని మన్సు నిమ్మళం జేస్కో. పొద్దత్తమానం గదే యిశారంల ఉండుకుంట నెత్తినొప్పి తెచ్చుకోకు. గాడేడికి బోతడు, మనవేడికి బోతం జర సయిమం అటీటైతది."
"నువ్వు గిట్ల దైర్నం జెప్పినంక మన్సుల జొచ్చిన బయం కాత్తంత బోయింది అవ్వా! నువ్వు జెప్పినవ్ సూడు యినాయకున్ని బతిలాడుకున్నట్టు బతిలాడుకుంట. గందుల నీ సాయం సుత దీస్కుంట. వత్తవ్వా! "
" గదండీ సంగతి! "ఇచ్చేటప్పుడు కాముని పండుగ - పుచ్చుకునేటప్పుడు వినాయక చవితి " అంటే గిదే మరి. ఎన్కట ఒక్క మాట పడకుండ సాటుంగైనా, నేటుంగైనా అప్పు తీర్సుకునేటోళ్ళం. గిప్పుడంత నియతెక్కడుంది శెప్పుండ్రి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి