వ్యవసాయంలో రసాయన ఎరువులు ప్రమాదం : - మంజుల పత్తిపాటి
 

యాదాద్రి భువనగిరి జిల్లా, మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంజుల పత్తిపాటి పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ వ్యవసాయంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగం వల్ల మన నేల, పర్యావరణం ,  మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతోంది అనేది మనం సీరియస్‌గా ఆలోచించాలి అని అన్నారు. మన అమ్మలాంటి భూమికి విషం పోసి… అదే భూమి పండించిన ఆహారాన్ని మనమే తింటున్నాం, అందువల్ల 
భూమి పాడై పోతుంది మనం రోగాల బారిన పడుతున్నాం.
కనుక వ్యవసాయంలో ప్రమాదకర రసాయనాల వినియోగాన్ని తగ్గిస్తూ, సురక్షితమైన మరియు స్థిరమైన వ్యవసాయం వైపు అడుగులు వేయాలి అని పిలుపు ఇచ్చారు.
సిక్కిం తరహా సుస్థిర, సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాల్సిన సమయం వచ్చింది అని అన్నారు.
కామెంట్‌లు