ఆస్ట్రేలియా క్రీడారంగం ఇప్పటికీ ఆశ్చర్యంతో, దిగ్భ్రాంతితో మాట్లాడుకునే ఘటన ఇది.
అక్కడ అది ఒక అసాధారణమైన సంఘటన.
భారతీయ సంతతికి చెందిన శుభ్ పటేల్ వయస్సు 12 సంవత్సరాలు. అతను ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో ఉన్న 'టూవాంగ్ సాకర్ క్లబ్' జట్టు తరఫున ఫుట్‌బాల్ ఆడుతున్నాడు.
ఒక మ్యాచ్ జరుగుతున్నప్పుడు, మైదానంలో ఉన్న రెఫరీ శుభ్ మెడలో ఉన్న తులసి మాలను తీసివేయమని చెప్పాడు.
దానికి ఆ బాలుడు సంప్రదాయ హిందూ స్వామినారాయణ పరంపర ను పాటిస్తున్నానని, ఐదేళ్ల వయసు నుంచే ఈ మాల ధరిస్తున్నానని చెప్పాడు. ఒక ఆట కోసం తన మత విశ్వాసాన్ని వదులుకోలేను, మాలను తీసేది లేదని స్పష్టం చేసి వెంటనే మైదానం నుంచి బయటకు వచ్చేసాడు.
తులసి మాల తీయమన్న అంపైర్ ఆ సమాధానానికి నోరెళ్లబెట్టాడు. 12 ఏళ్ల చిన్న పిల్లాడి నుంచి అలాంటి గట్టి స్పందన వస్తుందని అతను అస్సలు ఊహించలేదు.
ఈ సంఘటన ఆస్ట్రేలియా మీడియాలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆట నిబంధనల ప్రకారం ఆభరణాలు వేసుకోవడం నిషేధమే అయినప్పటికీ, తులసి మాల అనేది మతపరమైన నమ్మకం కాబట్టి 'ఫుట్‌బాల్ క్వీన్స్‌లాండ్' సంస్థ విచారణ జరిపింది.
ఆ తర్వాత, ఆ సంస్థ ప్రతినిధులు స్వయంగా ఆ అబ్బాయి ఇంటికి వెళ్లారు. కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పారు. తులసి మాల బయటకు ఊగకుండా మెడను పూర్తిగా కప్పే దుస్తులు ధరించి మళ్లీ ఆటకు రావాలని ఆహ్వానించారు.
ఇది 12 ఏళ్ల పిల్లాడి మత భక్తి మాత్రమే కాదు, తన ధర్మాన్ని విడిచిపెట్టని నిజమైన "ఆత్మగౌరవం".

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి