ఉపాధ్యాయ దినోత్సవం శుభాకాంక్షలుతో
చక్కని భవితను పంచేటి వెలుగు గురువు ఐతేనే
భావి జగతి భవిష్యత్తు బంగార మయ్యేది
చరిత్ర లోగిలిలో నిజమైన వెలుగు నింపేది గురువు
కోటి నవ్వులు పంచే దివిటీ గురువుఐతే
కల్మషము ఎరుగనీ బాల్యము వికసించేది
భువిలో వెలిసిన నిండు కల్పతరువు గురువు
సజీవ సాక్ష్యాలకు నిలువెత్తు ప్రతిరూపాలు ఐతేనే
సమాజ లోగిలిలో రుగ్మతలు అలా తొలిగిపోయేది
సజీవ సాక్ష్యాలను నిలిపే విజ్ఞాన తిమిరము గురువు
సమాజంలో న్యాయాన్ని కాచే నాయకుడు ఐతేనే
రాజకీయ కుళ్ళును అమాంతంగా కూల్చేది
భావి జగతిలో రాజ్యాంగ రక్షకుడు గురువు
క్రమశిక్షణ అనే ఆయుధంను గుండెల్లో నింపితేనే
దేశ భవితకు స్వేచ్చ ప్రపంచమును ఇచ్చేది
దేశమాత మదిలో మానవత్వపు పరిమళము గురువు
స్వార్థం ఎరుగనీ అమ్మతనమై భువిలో నిలిచితేనే
ప్రతి బడి కోవెల ఆనందపు పరిమళమై నిలిచేది
జగతిలో నిలిచిన దేవుని ప్రతిరూపం గురువు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి