తీరిక చేసుకోకపోతే
తపన తీరే దారేది
తీరం చేరే జాడేది?
దూరం చాలా ఉందని
ఆలోచిస్తూ నిలిచిపోక
అడుగు ముందుకేస్తే కదా
అడుగయినా తరిగేది!
వల్ల కాదులెమ్మని
వద్దనుకుని ఆగిపోక
ఒక్కసారి ప్రయత్నిస్తే కదా
ఒడుపు తెలిసి గెలిచేది!
ఓడిపోతున్నానని
ఓటమి తప్పదని ఆగిపోక
నేర్చుకుందాం అనుకుని
ఓర్చుకుంటే కదా ఒనగూడేది!
నిన్ను మించిన తోడు
నీకు ఇంకెవరూ....
నిన్ను నీవు తెలుసుకుంటే
నువ్వే ఒక సైన్యం!
చీకటి ఎంతకీ పోదేమని
చిరాకు పడితే ఎలా?
వేకువ రావాలంటే...
వేగుచుక్క పొడిచే తీరాలిగా!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి