ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఆదివారం నలంద పబ్లిక్ స్కూల్, మెళియాపుట్టి వారి ఆధ్వర్యంలో తొలి తెలుగు దళిత కవి, కుసుమ ధర్మన్న గారి జీవితంపై బాల సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా, వక్తగా శ్రీ దుబ్బ భాస్కరరావు (రిటైర్డ్ సి.ఆర్.పి.ఎఫ్ ఎస్.ఐ) కవి, రచయిత, సామాజిక సేవకులు వారి జీవిత విశేషాలు, వారి పద్య శతకం, రచనలను తెలియజేస్తూ జీవితంలో ప్రతి ఒక్కరూ నీతి నియమాలతో, క్రమశిక్షణగా ఉండాలనీ, పరులకు సహాయపడే గుణాన్ని చిన్నతనం నుండి అలవర్చుకొవాలని, సమాజానికి మేలు చేయాలని, ప్రకృతి పర్యావరణ పరిరక్షించాలని విద్యార్ధినీ విద్యార్థులకు చెప్పారు. బాల సాహితీ సమ్మేళనానికి న్యాయ నిర్ణేతలుగా, కవులుగా వ్యవహరించిన ప్రముఖ రచయిత, గాయకులు చింతాడ రామచంద్రరావు, పద్య కవి, నాటక కళాకారుడు రఘుపాత్రుని సాయిశివ, ప్రముఖ కవి, రచయిత ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు (ఋష్యశ్రీ)లు పాటలు, పద్యాలు, కవితలతో అలరించారు. వీరికి నలంద స్కూల్ ప్రిన్సిపాల్ జె.జె.ఎస్.ప్రతాప్ గారు జ్ఞాపికలు అందజేసి దుశ్శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు. అనంతరం సాహిత్య సమ్మేళనంలో పాల్గొన్న విద్యార్ధినీ విద్యార్థులకు జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, అధికారులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.
కుసుమ ధర్మన్న గారి జీవితంపై బాల సాహిత్య సమ్మేళనం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి