భగవాన్: - యామిజాల జగదీశ్
 

ఒక రోజు వయసు మళ్ళిన పెద్దాయన భగవాన్ రమణ మహర్షి వద్దకు వచ్చి..."స్వామీ! నా సందేహాన్ని తీర్చండి!" అని నెమ్మదిగా అడిగాడు.
భగవాన్ ఆయన్ని చూసిన వెంటనే చదువు రాని విద్యార్థి గురువును చూసి భయపడినట్లు వణకడం మొదలుపెట్టారు.
రమణుల వారికి ఎందుకీ భయమని భక్తులకు అర్థం కాలేదు.
భగవాన్ నవ్వుతూ పక్కనున్న భక్తుడికి ఆ పెద్దాయనను చూపించి, "ఈయనెవరు అనుకుం టున్నారు? ఈయన ప్రశ్నలకు సమా ధానం చెప్పలేకనే నేను మధుర నుండి ఇక్కడికి పారిపోయి వచ్చాను. ఈయనైతే, ప్రశ్నలతోనే నన్ను వెతుక్కుంటూ ఇక్కడికే వచ్చేశారు" అని చెప్పారు.
ఇది విని ఆ పెద్దాయన నవ్వుతూ నెమ్మదిగా కూర్చున్నారు.
ఆ పెద్దాయన మరెవరో కాదు. మధురలో భగవానుడికి తమిళ పాఠం నేర్పించిన గురువు.
భగవాన్ చెప్పిన సరదా మాటలతో అందరూ నవ్వారు.
కామెంట్‌లు