వైకుంఠపాళి (రుబాయిలు ): - టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.


తాత్వికమౌ జ్ఞానంబును తెలియచేయు నాట యిదియె.
జీవితాని కర్థంబును బోధచేయు నాట యిదియె 
పరమపదపు సోపానము చేరాలని పట్టుదలను 
పిల్లలలో పెద్దలలో ప్రోదిచేయు నాట యిదియె.//


వైకుంఠపుపాళి నాడి ధీమణులయి వర్థిలండి!
గెలుపోటము లుంటాయని ప్రాజ్ఞతమెయి వర్థిలండి!
పిల్లలార!భరతజాతి క్రీడలలో తత్వమెఱిగి 
దేశమునకు ఖ్యాతి పెంచు వారసులయి వర్థిలండి!//

బుద్ధిబలము పెంచుచుండు నాటలతో ప్రగతి కలుగు.
దేహమునకు శక్తి నిచ్చు క్రీడలతో ప్రగతి కలుగు.
భారతీయ సంస్కృతిని తెలిసికొనుచు జాగృతులయి 
నవశకముకు నాంది పలుకు ఛాత్రులతో ప్రగతి కలుగు.//

కామెంట్‌లు