ఆకలి రాజ్యం — మంజుల పత్తిపాటి.


ఆకలి రాజ్యములో…
నా అక్షరాలు కూడా ఆకలిగానే ఉన్నాయి…!
కవితలు రాయాల్సిన నా చేతులు
కడుపు నింపుకోవడానికి
కాయ కష్టంలో కరిగిపోతున్నాయి…!

విందు వినోదాల వాసనలు వెదజల్లే
వైభవ భవంతులు వెలుగుల్లో ఊగుతుంటే..!
మరోవైపు—
పొయ్యిలో మంట కోసం
పేదవాడి పూరిగుడిసె
పొగ కోసం మూలుగుతుంటే…!

ఈ పుణ్యభూమిలో
పేదవాడిగా పుట్టడం మన తప్పా…?
ఆకలి మంటల్లో
అక్షరాలకు పురుడు పోయడం నా తప్పా…?

రైతు చేతిలో ధర నిర్ణయించే రోజు రావాలి 
బసవన్న తాడును ముద్దాడే రోజు కాదు…!
కూలీ చేతుల్లో కూలి నిలవాలి…
కడుపులో ఆకలి కాదు…!

కడుపు నిండిన రోజే
నిజమైన స్వాతంత్ర్య దినం…!
ఆకలి లేని ఉదయం రావాలి…
అదే నా కవిత కోరుకునే
నిజమైన కవితా దినం…!
==========================
- మంజుల పత్తిపాటి
చరవాణి 9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా, తెలంగాణ.
కామెంట్‌లు