నక్షత్రాలను చూడగలను
శబ్దంతో పరిగెత్త గలను
కాంతితో కదలలేను....!!
విషాదాన్ని పంచలేను
వినోదాన్ని ఇవ్వగలను
నిన్ను ప్రేమించగలను
నిన్ను ద్వేషించలేను....!!
గాలి లా ఎగురగలను
మేఘంలా కదల గలను
దాహం తీర్చగలను
సముద్రం కాలేను..........!!
మండుటెండను కాగలను
ఎండమావిని కాలేను....
పండును కాగలనూ
పండుటాకును కాలేను....!!
నిండు మనసును కాగలను
వెలితికుండను కాలేను
అందగత్తెను కాగలను
చెలికత్తెను కాలేను...........!!
చెలిమి చేయగలను
కలహం కాలేను.
సంతోషం చెంత చేరగలను
కలత చెందలేనూ.............!!
కళలు నేర్చుకోగలను
కలలను నెరవేర్చుకోలేను
ఆశ పెట్టగలను. ఆశించలేను.!!
మరణించగలను
మళ్లీ జన్మించలేను
ప్రేమను పుట్టించగలను
ప్రేమించలేను..... నేనింతే...!!?
==========================
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి