తట్టుకోనేంతవరకే!
పరిగెత్తే కాలాన్ని
పట్టుకోగలమా ? ఆపగలమా ?
పువ్వుకైనా పండుకైనా
చెట్టు మీదనే విలువ
రాలు పువ్వుల మీద
తుమ్మెద వాలునా?
పెదవి దాటిన మాట
పెను వేగంగా పయనించి
రంగు రూపులు మార్చుకుంటూ
వింత వేషం వేసుకోదా?
చేసిన పాపం ఏదైనా
చెప్పుకుంటే పోతుంది
బయటపడని తప్పు
లోపలే కుళ్ళి ప్రాణం తీయదా?
కలిసి రాలేదని కాలం పై
కసి పెంచుకుంటారా?
తిరిగి రాదని గతంలోనే
నిలిచి పోయే వీలుందా?
పిచ్చి వాదన చేయగోరు
చిత్రమీ మనసు తీరు
నొప్పించక తానొవ్వక
తప్పుకునే దారి చూపమంటూ...
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి