అక్షరాస్యత దినోత్సవ శుభాకాంక్షలు.
కొన్ని నక్షత్రాలను చల్లాను
అవి మెరిసే అక్షరాలై విరిసాయి.!!!
నేను భూమిపై
కొన్ని విత్తనాలను విసిరేసాను
అవి అక్షరాల మహావృక్షాలై నిలిచాయి.!!
నేను భూమి పైకి
కొన్ని వాన చినుకుల్ని చల్లాను
అవి అక్షరాల మహానదులై పారినవీ.!!
నేను భూమి పైకి
గాలిని విసిరేసాను
అవి అక్షరాల పరిమళాలై
ఊపిరితిత్తుల్లో మొలకెత్తుతున్నాయి.!!
నేను గొంతులోకి
ఊపిరి పోసి విసిరేసాను
అవి అక్షరాల సప్త స్వరాలై వినిపిస్తున్నాయి.!!
నేను నాలుకలపై
నిశ్శబ్దంగా శబ్దాన్ని విసిరేసాను
అవి అక్షరాల మాటలై పాటలై
మారుమోగుతున్నాయి.!!
నేను మస్తిష్కంలోకి
ఆలోచనలను విసిరేసాను
అవి అక్షరాల పుస్తకాలై ముస్తాబవుతున్నాయి.!
నేను కళ్ళల్లోకి
కాంతిని విసిరేస్తున్నాను
అవి కాగితంపై అక్షరాల చూపులై
దూసుకుపోతున్నాయి...!!
================================
నేడు అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి