ఆయన సరస్వతీ మాత మానస పుత్రులు. సంస్కృత, ఆంధ్ర భాషా పండితులు .ముఖ్యంగా వినయ విధేయతలు మూర్తీభవించిన పండితాగ్రేసరులు.తెలుగు భాషా నిఘంటువు కే వన్నెతెచ్చిన మహానుభావులు. వారి మొన్న శ్రీరామచంద్రుని దరి చేరిన ఆచార్య రవ్వా శ్రీహరి గారు.
సాధారణ చేనేత కుటుంబంలో పుట్టినా సురవరం ప్రతాపరెడీపీ మరియు నరసింగ రావు గారి సహాయం చే యాదగిరి లక్ష్మీ నరసింహ సంస్కృత పీఠం లో చేరి తరువాత విద్యయందు ప్రతిభని గాంచి గురుప్రోధ్బలంచే సీతారాం బాగ్ లో డి ఓ .ఎ ల్ మరియు బి.ఓ.ఎల్ పరీక్షలలో ఉత్తీర్ణత చెంది
మొదట తెలుగు పండితునిగా పనిచేసారు
విద్యకు అంతంలేదని తెలుగు మరియు సంస్కృతంలలో ఎం. ఏ చేసి తెలుగు సారస్వత పరిషత్ లో విద్యార్థులకు రెండు భాషాలలోను పాఠాలు చెబుతు ఉస్మానియా లో లెక్చరర్ గా చేరి భాస్కర రామాయణం మీద పరిశోధన ద్వారా డాక్టరేట్ పొందారు.
నిరంతర పరిశ్రమచే ఏబది తెలుగు ఇరువది ఐదు సంస్కృత పుస్తకాలను రచయించిన పండితులు. ఆచార్య శ్రీహరి నిఘంటువు తయారీకి ఎనిమిది సంవత్సరాల సమయం పట్టింది. ప్రధానంగా వారు అనేక తెలంగాణ మాండలీక పదాలను నిఘంటువు లో చేర్చారు అది నేడు ఎందరికో ప్రామాణికం
కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం ఉపకులపతి గా వేరు చేసిన సేవలు మరువలేనివి
పరిశోధకులకు అవసరమైన అలబ్ధ కావ్య రత్నావళి, .తెలుగులో అలబ్ధ వాజ్మయం ఎందరో పరిశోధకులకు మార్గదర్శకం శ్రీహరి గారి వ్యాసాలు సాహితీ నీరాజనం,హృదయ భారతి పేరిట అచ్చయ్యాయి. నిఘంటువు, భాష, పదకోశం, పరిశోధన అనేక పలు రంగాలలో జీవితాంతం భాష కోసమే పరితపించిన భాషా ప్రేమికులు శ్రీహరి గారు
కవి గుర్రం జాషువా గారి గబ్బిలం, ఫిరదౌసి కావ్యాలనుల వారిపైనున్న అభిమానంతో ఛందస్సు లో సంస్కృతంలో 'తైలపాయిక' అనే పద్యకావ్యం గా రచించారు. అన్నమయ్య సూక్తిసుధ,వేమన, సుమతీ శతకాలను సంస్కృతంలో అనువదించారు. తిరుపతి వేంకటేశ్వర సంస్కృత విశ్వవిద్యాలయం ' మహో మహో పాధ్యాయ' పురస్కారాన్ని అందించింది.
ఇంతటి మేధా సంపన్నులు సరస్వతీ పుత్రునికి కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మశ్రీ పురస్కారం లభించక పోవడం చాలా బాధాకరం. ఎంత ఎత్తుకు ఎదిగినా వినయ విధేయతలు కలిగి అందరిని ఆప్యాయత తో పలకరించే మన ఆచార్య రవ్వా శ్రీహరి గారు లేని లోటు తెలుగు సాహిత్యానికే తీరని లోటు
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా వారిసేవలను గుర్తించి పద్మశ్రీ కొరకై కేంద్రానికి ప్రతిపాదన పంపితే బాగుంటుంది
ఏమైనా వారి రచనల ద్వారా సదా స్మరణీయులు.
......................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి