కృష్ణా, నీకు నా వందనం: - - యామిజాల జగదీశ్
 

లోకనాథుడా! రాధమ్మ గుండెల్లో కొలువైన వాడా! గోకులంలో  ఆనం దాన్ని నింపిన వాడా...భక్తుల భయాలను పారద్రోలేవాడైన శ్రీకృష్ణుడికివే నా వందనాలుయ!!
చేతిలో మురళితో మురిపించేవాడు, నల్లని మబ్బుల వన్నెతో మెరిసేవాడు, పసుపు పచ్చని వస్త్రాలు ధరించి ఎంతో ప్రశాంతంగా నిర్మలంగా ఉండే ఆ మధుసూదనుడికి నమస్సులు!!
బృందావనంలో విహరించేవాడు, గోపికల మనసు దోచుకున్నవాడు, రాధకు ఎంతో ఇష్టమైన ఆ కృష్ణుడికి సదా నా నమస్కారాలు.
దీనులకు దిక్కు...దయాసముద్రుడు, కరుణామయుడైన ఓ మాధవా! నేను చేసిన వేలాది తప్పులను క్షమించు తండ్రీ....నాకు ధనం వద్దు...కీర్తి ప్రతిష్ఠలు వద్దు...రాజ్యం వద్దు...ఎలాంటి సుఖాలు వద్దు...ఓ కృష్ణా! 
ఎన్ని జన్మలెత్తినా నీ పాదాల పట్ల నాకు భక్తి ఉంటే చాలు కృష్ణా! 
నువ్వు ఈ జగత్తుకే స్వామివి... రాధమ్మ మనసుకు రాజువు... గోకులానికి ఆనందాన్నిచ్చే వాడివి.
ఓ మురళీమనోహరా! నాలోని భయాన్ని, అహంకారాన్ని, అజ్ఞానాన్ని దూరం చేయగలవు నాకు డబ్బూ, కీర్తీ, ఈ లోకంలోని సుఖాలూ ఏమీ వద్దు 
ఎన్ని జన్మలకైనా సరే నీ పాదాల చెంత నాకు భక్తి నిలిచి ఉంటే చాలు.
"ఓ కృష్ణా! నీ దర్శనం కన్నా నీ భక్తినే నాకు ప్రసాదించు...ఎందుకంటే, దర్శనం ఒక్క క్షణమే తృప్తినిస్తుంది, కానీ భక్తి నా జీవితాన్నంతటినీ నీకు అంకితం చేస్తుంది."
కామెంట్‌లు