కృష్ణుడు- యామిజాల జగదీశ్

 
కృష్ణుడి చేతిలో కంసుడు చనిపోవడంతో, కంసుడి మామ జరాసంధుడికి విపరీతమైన కోపం వచ్చింది. కృష్ణ బలరాములను అంతం చేయడానికి వాడు మధుర మీద పదిహేడు సార్లు దండయాత్ర చేశాడు.
ప్రతిసారి ఓడిపోయిన తర్వాత వాడు తనలాంటి రాజులందరినీ ఏకం చేసి, పెద్ద కూటమి కట్టి మధుర మీదకు దండెత్తేవాడు. కానీ కృష్ణుడు ఆ సైన్యాన్ని మొత్తం చంపేసి, కేవలం జరాసంధుడిని మాత్రమే ప్రాణాలతో వదిలేసేవాడు.
ఇది చూసి బలరాముడికి చాలా కోపం వచ్చి కృష్ణుడితో అన్నాడు... "వాడు ప్రతిసారి ఓడిపోయినా, ఎక్కడెక్కడి నుంచో దుర్మార్గులను వెతికి పట్టుకుని మన మీదకు మళ్లీ మళ్లీ దాడులు చేయిస్తున్నాడు. నువ్వు సైన్యాన్ని  చంపుతున్నావు కానీ, అసలు సూత్రధారి అయిన వాడిని మాత్రం ఎందుకు వదిలేస్తున్నావు?"
అప్పుడు కృష్ణుడు నవ్వుతూ బలరాముడికి ఇలా వివరించాడు... "అన్నా, నేను వాడిని కావాలనే ప్రతిసారీ వదిలేస్తున్నాను. ఎందుకంటే, ఆ జరాసంధుడే భూమి మీద ఉన్న చెడ్డవాళ్లందరినీ ఏకం చేసి నా దగ్గరకు తీసుకొచ్చి పడేస్తున్నాడు. ఒకే చోట వీళ్లందరినీ సులభంగా తుదముట్టిం చవచ్చు. లేదంటే ఈ దుర్మార్గులందరి కోసం భూమి చుట్టూ తిరగాల్సి వస్తుంది.
పుట్టలో పాములను వెతికినట్టు ఊరూరూ తిరిగి చంపడానికి చాలా కష్టమయ్యేది. నా పనులన్నీ జరాసంధుడు చాలా సులభం. దుష్ట శిక్షణ పూర్తి కాగానే చివర్లో వీడిని కూడా ఖతం చేస్తాను. నువ్వు అసలు ఏమాత్రం ఆలోచించకు అన్నయ్యా..."
a
కామెంట్‌లు