సిరిబొజ్జ నీదయ్య వేలుపుల రాజుకు దండాలయ్యా
నీ అజ్జ మాకు దిక్కయ్యా మమ్మల్ని నీవే ఆదుకోవయ్యా
నీ ఉజ్జ మాకు బలమయ్యా అదే సాధనలకు అవిఘ్నమయ్యా
మట్టి విగ్రహాలతో నిన్ను ప్రతిష్టిస్తామయ్యా.
పర్యావరణ పరిరక్షణకు అదే మేలయ్యా.
పవిత్ర పత్రాలతో పూజలు చేస్తామయ్యా.
సకల శుభాలు మాకు అనుగ్రహించవయ్యా.
ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పిస్తామయ్యా.
చందురునికి అమ్మ ఇచ్చిన శాపం తెలుసయ్యా.
శమంతక మణి కథను వింటామయ్యా.
అక్షింతలు శిరసున వేసుకుంటామయ్యా.
అనంత చతుర్దశి రోజున నిమజ్జనం చేస్తామయ్యా.
భక్తిశ్రద్ధలతో సామూహిక ఊరేగింపులు మాకు ఆనందమయ్యా.
సహృద్భావంతో ఒకరికొకరు సహకరించుకుంటామయ్యా.
స్వామి నీకు మేము పలికే వీడ్కోలుకి నీ కృప కావాలయ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి