మనిషికి సహాయం చేయడం గొప్ప విషయం, కానీ సరైన సమయంలో చేయడం అంతకంటే గొప్ప విషయం.
ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు అందించే చిన్న సహాయం కూడా వారికి పెద్ద ప్రపంచంలా అనిపిస్తుంది.
ఆకలితో ఉన్నవారికి ఇప్పుడు కావాల్సింది అన్నం,అంతే కానీ రేపటి ఆహ్వానం కాదు.కష్టంలో ఉన్నవారికి ఇప్పుడు కావాల్సింది చేయూత, తర్వాత వచ్చే సానుభూతి కాదు.అవసరం ముగిసిన తర్వాత చేసే సహాయానికి విలువ కంటే, ఆలస్యానికి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది.
చాలామంది సహాయం చేయడానికి తమకు అనుకూలమైన సమయాన్ని ఎంచుకుంటారు.కానీ నిజమైన సహాయం అవసరమైన వ్యక్తి సమయాన్ని గౌరవిస్తుంది.
మనకు వీలు ఉన్నప్పుడు కాదు, వారికి అవసరం ఉన్నప్పుడు చేయూత ఇవ్వాలి.ఎందుకంటే సమయం దాటిపోయిన తర్వాత ఇచ్చే పరిష్కారం సమస్యను మార్చలేకపోవచ్చు.
మునిగిపోయిన తర్వాత పట్టుకో అని విసిరిన తాడు ఎంత ఉపయోగం?
కన్నీళ్లు ఆగిపోయిన తర్వాత ఇచ్చే ఓదార్పు ఎంత ఉపశమనం?
అవకాశం కోల్పోయిన తర్వాత ఇచ్చే సలహా ఎంత ప్రయోజనం?
సహాయం యొక్క విలువ దాని పరిమాణంలో కాదు, అది చేరిన సమయంలో ఉంటుంది.
కాబట్టి సహాయం మనకు అనిపించినప్పుడు కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు చేయాలి.మొత్తానికి,
ఆకలి అయినప్పుడు అన్నం పెట్టాలి… అన్నం వండాక కాదు!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి