స్నేహితుడి అబద్ధపు పొగడ్త కంటే, శత్రువు చెప్పే నిజమైన తిట్టు మేలు. పొగడ్త నిన్ను అక్కడే నిలబెడుతుంది, విమర్శ మాత్రమే నిన్ను తదుపరి స్థాయికి తీసుకెళ్తుంది.
మనమందరం పొగడ్తనే కోరుకుంటాం. ఎవరో మనల్ని పొగిడితే వెంటనే సంతోషిస్తాం. కానీ ఆలోచించి చూడండి...
నీ స్నేహితుడు నిన్ను నొప్పించకూడదనే ఉద్దేశంతో, నువ్వు చేసే తప్పును కూడా "సూపర్" అని చెప్పి వదిలేస్తాడు.
అందువల్ల నీకు వచ్చే లాభం ఏమిటి?
నువ్వు అదే తప్పులో ఆగిపోతావు.
కానీ ఒక శత్రువు?
అతను నిన్ను నిశితంగా గమనిస్తాడు. నీ చిన్న తప్పును కూడా పెద్దది చేసి, గట్టిగా తిడతాడు.
ఆ తిట్లో నూటికి నూరుపాళ్లు కోపం ఉన్నా, ఒక్క శాతం నిజం ఉంటుంది. ఆ ఒక్క శాతం నిజం పట్టుకుని నువ్వు సరిదిద్దుకుంటే, ఎదిగిపోతావు అంటాడు లియోనార్డో డా విన్సీ!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి