చదువులందున మేటి యాతడు
బాధలెన్నో పడెను ఆతడు
సర్వేపల్లికి వందనం
రాజనీతిన రాణకెక్కిన
తత్వవేత్తగ వినుతికెక్కిన
రాజకీయపు పదవి పట్టిన
సర్వేపల్లికి వందనం
ఉత్తమోత్తమ ఒజ్జ యాతడు
రాయబారిగ యుండె నాతడు
రాష్ట్రపతిగా ఎదిగెనాతడు
సర్వేపల్లికి వందనం
సమయ పాలన ఉండె నెక్కువ
పారదర్శక మన్న మక్కువ
హాస్య చతురత యదియు మక్కువ
సర్వేపల్లికి వందనం
గురువులకు తను మార్గదర్శిగ
భరత మాతకు కార్యదర్శిగ
మంచి పనులను చేసినాడుగ
సర్వేపల్లికి వందనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి