సుప్రభాత కవిత : - బృంద


గుప్పెడంత  గుండెలో 
గడియ వేసిన గదిలో 
గుర్తు రానీయక ఆపిన 
గుచ్చే తలపుల జడిని...

గుమ్మాన పరచి నిలిపి 
రమ్మని పిలిచి కలిపి 
తెమ్మెరగా హాయిని గొలిపే 
కమ్మని వెలుగువు కావా?

గమ్యం ఎటో ఎరుగక 
గమనం ఆగిన బాటసారికి 
రహదారి వైపు మళ్ళించి 
సహకరించే నేస్తం కావా?

చీకటిలో చిక్కుకుని 
రేపటిపై ఆశ కోల్పోయి 
ముగిసిపోనున్న రేయిని 
మిగిలిపొమ్మని చెబుతూ..

నిరాశ ఆవిరించిన 
నీరస హృదయానికి 
నిరుపమాన  సాయంగా 
వేకువలోకి నడిపించే దైవంగా!

కదిలి వచ్చే కనక కలశపు 
కాంతి ధారల తడిపి 
కనువిందుగ కలలు పండగా 
తరలి వచ్చే పండుగకు 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు