మనిషికి ఉచితంగా దొరికే అత్యంత చవకైన వినోదం ఏంటో తెలుసా?అవసరం లేకపోయినా నోరు తెరవడం!ఎవరు అడగకపోయినా సలహా ఇవ్వడం,తెలియకపోయినా అభిప్రాయం చెప్పడం,విషయం తెలియకపోయినా మధ్యలో దూరి తీర్పు చెప్పడం!రావణుడు కూడా మాట్లాడాడు హనుమంతుడు కూడా మాట్లాడాడు.కానీ ఒకరి మాటలు సీతమ్మ హృదయాన్ని గాయపరిచాయి, మరొకరి మాటలు ఆమెకు ధైర్యాన్ని ఇచ్చాయి.కాబట్టి సమస్య నోటిలో లేదు… నోరు తెరిచే మనిషిలో,అనే మాటలలో ఉంది!
ఏనుగును ఒక్కసారి చూడండి.పెద్ద పెద్ద చెవులు… చిన్న నోరు!
ప్రకృతి దాన్ని చూసి నేర్చుకో అంటుంది. “ఎక్కువ విను, తక్కువ మాట్లాడు!”అని.మనిషికి మాత్రం చెవులు రెండు, నోరు ఒకటి ఇచ్చినా ప్రయోజనం లేదు.ఎందుకంటే మనం వినేది సగం, మాట్లాడేది డబుల్, అర్థం చేసుకునేది మాత్రం జీరో!గురువుల దగ్గర వినాల్సినప్పుడు మనకే ఎక్కువ జ్ఞానం ఉన్నట్టు మాట్లాడతాం.సభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మాత్రం మైక్ చూసి మౌనంగా ఉండిపోతాం.ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం అసలు ఆ సభ మొత్తాన్ని మనమే నడిపించినట్టు స్పీచ్ ఇస్తాం!ఎక్కడ మాట్లాడాలో అక్కడ మనకు సిగ్గు,ఎక్కడ నోరు మూసుకోవాలో అక్కడ మనకు ధైర్యం!ఇది మనిషి అభివృద్ధి కాదు… నాలుకకు ఇచ్చిన స్వేచ్ఛా దుర్వినియోగం!ఒక్క అనవసరపు మాటతో గొడవ మొదలవుతుంది,రెండో మాటతో
సంబంధం పాడవుతుంది,మూడో మాటతో “నేను అసలు అలా అనలేదు” అనే కొత్త డ్రామా మొదలవుతుంది!
పెద్ద పెద్ద పాపలు మూటకట్టుకునేది పనులవల్ల కాదు మనం మాట్లాడే మాటల వల్లనే!అందుకే మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించాలి.
ఎందుకంటే మాట్లాడే ముందు ఐదు సెకన్లు మౌనంగా ఉండటం కష్టం కావచ్చు…కానీ మాట్లాడిన తర్వాత ఐదు సంవత్సరాలు పశ్చాత్తాపపడటం ఇంకా కష్టం!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి