శ్రీకృష్ణసత్య!: - :పాలగుమ్మి జ్యోతి.


ప్రక్రియ: రుబాయిలు (తిశ్రగతి)

మురారితో ముదముతోన నర్తించే సత్యనేను!
ఇష్టసఖుని ప్రేమనంత కాంక్షించే సత్యనేను! 
పారిజాత పూలతోటి చెలికానిని పూజింతును!
శ్రీకృష్ణుని అనుక్షణము ధ్యానించే సత్యనేను!!

చిరుకోపము నాసికమున ధరియించిన భామామణి!
సొగసుతోన మరులుగొల్పి అలరించిన భామామణి!
సత్యభామ దాసుడనని ఎరుగునట్టి ప్రియురాలా!
సతులలోన  ప్రియసతివని గుర్తించిన భామామణి!! 

కామెంట్‌లు