నేటి విద్యార్థులు, యువత కాళోజీ నీ స్ఫూర్తిగా తీసుకోవాలి


  ప్రజలకోసం తపించి, ప్రజల చైతన్యం కోసం కలం పట్టి రచనలు చేసిన ప్రజాకవి,మానవతావాది,  కాళోజీ నారాయణరావు గారనీ నేటి విద్యార్థులు, యువత కాళోజీ నారాయణరావు గారనీ స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు అన్నారు. 
       తేదీ 09-09-2026న జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా తెలంగాణ భాష దినోత్సవం నిర్వహించారు. 
     ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్. పద్మావతి గారు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ యాస భాషలో రచనలు చేసారని, తెలంగాణకోసం ఉద్యమించారనీ, ఉపాధ్యాయ శాసనమండలి సభ్యుడుగా సేవలందించారనీ, నిత్యం ప్రజలకోసం పరితపించిన మానవతావాది అన్నారు. 
         జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి, రచయిత వాసరవేణి పర్శరాములు మాట్లాడుతూ కాళోజీ నారాయణరావు గారు "నాగొడవ", జీవనగీతిక,  బాపు బాపు బాపు, కాళోజీ కథలు, తెలంగాణ ఉద్యమ కవితలు రచించారనీ, పద్మ విభూషణ్ అవార్డు పొందారని, తన బాడీని వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు ఇచ్చారని, సేవా భావం కలిగి ఉన్న గొప్ప మహనీయుడనీ అన్నారు. 
     ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్ పద్మావతి గారు, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, నీరటి విష్ణు ప్రసాద్, జ్యాతోతు శ్రీనివాస్, వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, నిఖిల్, ఎన్.ఎస్. ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు