అమ్మల కామేశ్వరికి సాహితీ మిత్ర పురస్కారం


 మెట్టూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హిందీ ఉపాధ్యాయని, కొత్తూరు రచయితల వేదిక మహిళా కార్యదర్శి, ప్రముఖ కవయిత్రి, గాయని అమ్మల కామేశ్వరి మరో అరుదైన పురస్కారం పొందారు. 
తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్  కూకట్ పల్లి ప్రగతి నగర్ సుందరయ్య భవన్ లో కరీం నగర్ సాహిత్య వేదిక, అక్షర కుసుమాలు సంయుక్తంగా రెండు పుస్తకాల ఆవిష్కరణ  కార్యక్రమంలో కామేశ్వరికి ఈ ఘనత లభించింది. ఈ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో తెలుగు భాష గొప్పతనం శీర్షికతో స్వీయ గీతాన్ని గానం చేసిన కామేశ్వరి ఈ సాహితీ మిత్ర పురస్కారానికి ఎంపికై, సత్కారం పొందారు. అధ్యక్షులు డా.వైరాగ్యం ప్రభాకర్ సంపాదకత్వంలో వెలువడిన యుద్ధం మొదలైంది, హృదయపీఠిక సంకలనాల ఆవిష్కరణల వేదికపై, ప్రభాకర్ తో పాటు, ముఖ్య అతిథిగా విచ్చేసిన శతాధిక గ్రంథకర్త బి.ఎస్.రాములు, అతిథులు డా.కె.గోవర్ధన్ రాజు, సాధనాల వెంకటస్వామి నాయుడు, సి.హెచ్.మల్ల రామాచారి,
కామేశ్వరిని శాలువా, జ్ఞాపిక, పుష్పగుచ్చం, సాహితీ మిత్ర పురస్కార ప్రశంసా పత్రం, కానుకలతో ఘనంగా సన్మానించారు. కామేశ్వరి మాట్లాడుతూ తన కవితాగానం ప్రతిభ సాధించిన నేపథ్యంలో ఈ పురస్కారం లభించిందని, పురస్కార ప్రదానం గావించిన ప్రముఖులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. కామేశ్వరికి సాహితీ మిత్ర పురస్కారం లభించుట పట్ల స్థానిక విద్యావంతులు రచయితలు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు