కొడుకు డాక్టర్ కామేశం
కృష్ణాష్టమి వేడుకలు కడురమ్యంగా జరుగుతాయని
చిన్ని కృష్ణుడు గోపబాలురు కలసి
లేక్ వ్యూ ప్రాంతంలో
ఉట్టి కొట్టే దృశ్యాలు
ఇస్కాన్ ఆలయంలో భగవద్గీత పోటీలు
బృందావనంలో గోపికా కృష్ణుల వేషధారణ బాగుంటుందంటే
కాకినాడ నుంచి కొడుకు దగ్గరకొచ్చిన
డెబ్బై ఏండ్లు దాటిన కృష్ణవేణమ్మ
మనుమలు
కళ్యాణ్, కిరణ్మయిలకు
చిన్నికృష్ణుడు గోపిక వేషాలు తానే వేసి
కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొనేటట్లు చేసి
గీతా శ్లోక పఠన పోటీలలో
బహుమతులు వస్తే
ఏ దేశమేగినా మన సంస్కృతి సంప్రదాయాలు
వసుదైకానికే ఆదర్శం
కాకినాడలో కన్న కాలిఫోర్నియాలో
కృష్ణాష్టమి వేడుకలు
చాలా బాగా జరిగాయి
నా మనుమలు వేషధారణ అద్భుతమని
వణికే చేతులతో దిష్టి తీస్తే
డాక్టర్ కామేశం తనలో తానే అనుకున్నాడు
అసలు కన్న వడ్డి ముద్దన్నది అక్షరసత్యం.!
................................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి