నీటి యుద్ధం మొదలైంది, మేల్కొందామా: …మంజుల పత్తిపాటి.


నీటి యుద్ధాలు రాలేదా…?
నీటి యుద్ధాలు రాలేదా…
రాలేదంటారా?
చెప్పండి…!
నీటి విలువ తెలియని మనం
బాటిల్‌లో నీటిని కొనుక్కుంటున్నాం…!
నీళ్లు ఉచితమే కదా…
మరి ఎందుకు కొనుక్కుంటున్నాం?
ఒక్కసారి ఆలోచించండి…!
ఇది కూడా
నీటి యుద్ధమే కదా…!
నదులను ఆక్రమించాం…
చెరువులను పూడ్చేశాం…
భూగర్భ జలాలను తోడేశాం…
ప్రకృతి ఒడిని ఖాళీ చేశాం…!
భూతాపం పెరుగుతుంటే
చూస్తూ ఊరుకుందామా…?
చెప్పండి…!
ఒక్క మొక్క నాటండి…
ఒక్క చెట్టును కాపాడండి…
ఒక్క చుక్క నీటిని ఆదా చేయండి…!
ఈ రోజు మొక్కకు నీరు పోస్తే
రేపు మనిషికి నీరు దొరుకుతుంది…!
భవిష్యత్తుకు నీడనివ్వండి…
భవిష్యత్తుకు నీరునివ్వండి…!
=============================
 మంజుల పత్తిపాటి 
9347042218
ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్.
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం .
కామెంట్‌లు