ఒకరోజు ధర్మరాజు, దుర్యోధనుడు సరదాగా టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు.
మాటల మధ్య కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణుడు ఎవరి పక్షాన నిలుస్తాడనే చర్చ వస్తుంది.
“కృష్ణుడు నాకే అత్యంత సన్నిహితుడు, మా పక్షానికే మద్దతు ఇస్తాడు” అని ఇద్దరూ ధీమాగా చెప్పుకుంటారు.
నిజం తెలుసుకోవడానికి టీ తాగడం పూర్తయ్యాక ఇద్దరూ కృష్ణుడిని కలవడానికి వెళ్తారు.అప్పటికే కృష్ణుడు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటూ నిద్రలో ఉన్నాడు.ఆయన నిద్రలేచిన వెంటనే ఎవరిని ముందుగా చూసి నవ్వుతాడో వారికే మద్దతు లభిస్తుందని ఇద్దరూ అనుకుంటారు.కృష్ణుడు తనకు అత్యంత సన్నిహితుడు కాబట్టి తల దగ్గర కూర్చోవాలని దుర్యోధనుడు మొండిగా నిర్ణయించుకున్నాడు.
అక్కడ స్థలం లేక,చేసేది ఏం లేక ధర్మరాజు కృష్ణుడి పాదాల దగ్గర కూర్చుంటాడు.ఇద్దరూ కృష్ణుడు ఎప్పుడు నిద్రలేస్తాడా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు.
కొద్దిసేపటికి కృష్ణుడు నిద్రలేచి కళ్లు తెరిచి ఎదురుగా తన పాదాల దగ్గర ఉన్న ధర్మరాజునే ఆయన ముందుగా చూసి నవ్వుతాడు.
ఈ అనుకోని పరిణామంతో దుర్యోధనుడు ఆశ్చర్యపోయి కోపంతో ఊగిపోయాడు.తాను ఎంచుకున్న స్థానం తనకు విజయాన్ని తెస్తుందని అతడు భావించాడు.కానీ అలా జరగలేదు.
మన జీవితం ఎప్పుడూ మనం ఊహించినట్టుగానే జరగదు.
కొన్నిసార్లు మనకు చిన్నదిగా కనిపించే స్థానం నుంచే గొప్ప అవకాశం వస్తుంది.మనకు వెనుకబడినట్టుగా అనిపించే పరిస్థితులే భవిష్యత్తులో విజయానికి కారణం కావచ్చు.
కాబట్టి ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నామనే విషయం చూసి ఎప్పుడూ బాధపడకూడదు.అదృష్టం మనం ఊహించని దిశ నుంచి, ఊహించని సమయంలో రావచ్చు.మీ స్థానం ఎక్కడ ఉందన్నది కాదు, మీ సమయం ఎప్పుడు వస్తుందన్నదే ముఖ్యం.
ఎందుకంటే మీ సమయం వచ్చినప్పుడు, మీరు ఉన్న చోటే మీ అదృష్టానికి అడ్రెస్స్ అవుతుంది!!
#################################################

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి