పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, శ్రీ శ్రీ కళా వేదిక నిర్వహించిన జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ రాష్ట్రపతి పురస్కార గ్రహీత ఐన తిరుమలరావు గురుదేవోభవ అను అంశంపై నిర్వహించిన కవితలపోటీల్లో పాల్గొని విజేత ప్రశంసాపత్రం సాధించారు. అంతర్జాతీయ సాహిత్య సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ, ఐ.ఎస్.ఓ.గుర్తింపు పొందిన తొలి ప్రపంచ సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక అంతర్జాతీయ ఛైర్మన్ కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదున గురుపూజోత్సవం సందర్భంగా గురుదేవోభవ అను అంశంపై అంతర్జాలం ద్వారా కవితల పోటీ నిర్వహించారు. స్పందించిన తిరుమలరావు గురుపూజ అనే కవిత పంపి టాప్ 20లో నిలిచి విజేత ప్రశంసాపత్రం పొందారు. ఇప్పటికే 171 రాష్ట్ర జాతీయ స్థాయి కవి సమ్మేళనాలను, ప్రపంచ మహాసభలను నిర్వహించి, 37ప్రపంచ రికార్డులను సొంతం చేసుకుంది శ్రీశ్రీ కళా వేదిక. చదువులతో సంస్కారం, విలువలతో శ్రీకారం, గురువులకే నిర్దేశం, ఆదర్శం ఆ చరితం అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ గూర్చి తన గురుపూజ కవితలో రచించారు తిరుమలరావు. పాఠం అభ్యసనం మన సంస్కృతి పెంచాలి, శోధించే పైపుణ్యం బాలలకందించాలి, భరతావని భవితవ్యం తరగతి గదిలో మొదలంటూ ఆయన విశదీకరిస్తూ రచించారు. అంతర్జాతీయ అధ్యక్షులు కత్తిమండ ప్రతాప్ కుమార్ ఆధ్వర్యంలో, జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం నేతృత్వంలో, జాతీయ ప్రణాళికా కార్యదర్శి డా.టి.పార్ధసారధి, జాతీయ కార్య నిర్వహణ అధ్యక్షులు నూక సంపత్ కుమార్, జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ నల్లా భాగ్యలక్ష్మిల సౌజన్యంతో, కార్యవర్గ ప్రతినిధులు మళేకార్ నాగజ్యోతి, చండ్ర వెంకటేశ్వరరావు, నరసింహశర్మ, సాహుసంథ్య, సువర్ణజోషి, సబ్బెళ్ళ మహాలక్ష్మీరెడ్డి, పి.సాయిసంతోషి, జి.లావణ్యల పర్యవేక్షణ సమన్వయంతో తిరుమలరావును అభినందిస్తూ విజేత ప్రశంసాపత్రం పంపారు. అదేవిధంగా గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా శ్రీ శ్రీ కళా వేదిక ఇటీవల నిర్వహించిన పోటీల్లో కూడా తిరుమలరావు, తెలుగు తల్లి సిగలో సాహిత్య సిరులు అనే కవిత పంపి ప్రశంసాపత్రం సాధించారు. నేడు గురుదేవోభవ పోటీల్లో విజేతగా నిలుచుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
గురుదేవోభవ కవితలపోటీల్లో విజేత కుదమ తిరుమలరావు
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి