విద్యార్థులు గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి: - ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి
జాతీయ సేవా పథకం దినోత్సవం 



విద్యార్థులు  నాయకత్వం, సేవాభావం అలవరుచుకోవాలనీ, గ్రంథాలయం సద్వినియోగం చేసుకోవాలని ఉత్తమ పౌరులుగా రాణించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి  అన్నారు. 
        యెల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం జాతీయ సేవా పథకం దినోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రంథాలయం ప్రారంభించారు. 
      ఈసందర్భంగా ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి గారు మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపట్ల బాధ్యత , క్రమశిక్షణ, సహాకారభావన పెంపొందించుకోవడంలో  జాతీయ సేవా పథకం ఎంతో ఉపయోగపడుతుందని, అదేవిధంగా కళాశాలలో ఏర్పాటు చేసిన గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలని  పుస్తక పఠనం ద్వారా  జ్ఞానం, భాషా నైపుణ్యాలు, సృజనాత్మక ఆలోచనాశక్తి పెంపొందుతాయనీ, పాఠ్య పుస్తకాలతోపాటు విజ్ఞాన , సాహిత్య, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను చదివే అలవాటును పెంపొందించుకోవాలి అన్నారు. 
      జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి, లైబ్రరీ ఇంచార్జీ డా. వాసరవేణి పర్శరాములు మాట్లాడుతు భారతదేశంలో స్వామినాథన్ గ్రంథాలయాలకోసం కృషి చేశారని, తెలంగాణలో గ్రంథాలయోద్యమాలు జరిగాయని, వట్టికోట ఆళ్వారుస్వామి, కొమర్రాజు లక్ష్మణరావు, మాడపాటి హనుమంతరావు, కాళోజీ నారాయణరావు, దాశరథి కృష్ణమాచార్యులు ఎందరో పోరాటాలు చేశారని ఊరూరా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలనీ అన్నారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో కూరెళ్ళ విఠలాచార్య, అలివేణి, వేములవాడలో వీరగోని ఆంజనేయులు స్వయంగా లక్షల పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేశారని, సిరిసిల్ల జిల్లాలో సింగారం, హరిదాసునగర్, నారాయణపురం, తాడూరు, దుమాల గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేశారని మన కళాశాలలో గ్రంథాలయం ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు.
       ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎస్.పద్మావతి, జాతీయ సేవా పథకం ప్రోగ్రాం అధికారి వాసరవేణి పర్శరాములు, అధ్యాపకులు క్యాతం సత్యనారాయణ, మాదాసు చంద్రమౌళి, చెరుకు భూమక్క, బుట్ట కవిత, జ్యాతోతు శ్రీనివాస్, గజ్జెల గంగాధర్,,అనుముల రవిచంద్ర,వెల్దండి సౌమ్య, అగోలం గౌతమీ, బోధనేతర సిబ్బంది విమల్ కుమార్, కనిమేని దేవేందర్, షాహినా సుల్తానా, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు