సామెత -345: ఇనుప గుగ్గిళ్ళు గాని మినప గుగ్గిళ్ళు కావు
***
"అవ్వా! ఏ ఆకు రాలినా ఈతాకు రాలదంటరు నిజమేనా? కండలు కరిగిచ్చొచ్చు గని బండలు కరిగిచ్చలేత్తమా? గుర్రాన్ని నీళ్ళ దనుక తోల్కపోతం గని నీళ్లు తాపించలేత్తమా?"
"ఏంది శెల్లే? వొకీలు సాబు లెక్క గిన్ని ప్రశ్నలు అడగబడ్తివి?ఇంతకీ ఎవలా మొండి ఘటాలు? ఏం తక్లీబ్ వొచ్చింది?"
"గంత కటీనం మడుసుల్తో మసలేతప్పుడు బత్కంత తక్లీబే అవ్వా!బండలస్మంటోళ్ళని మార్సాలె అన్కుంటం గని మనొల్ల అవుద్దా? అంతా బెమ గని.'పుట్టిన్నాటి బుద్ది పుడకల్తో" పోదని ఊకెనే అన్లే అవ్వా!"
" ఏంది శెల్లే గంత యాష్ఠకొచ్చినట్టు మాట్లాడుతున్నవ్,రంది వడ్తున్నట్టున్నవ్.పరేషాన్‌గ వున్నవ్. అస్లేమైందో శెప్పు శెల్లే."
ఏవుఁది అవ్వా! పెద్ద పొల్ల సద్వుకుంటనంటే సశేం వొద్దన్నడు.పొల్ల సద్వంటనే మండిపడుతుండు.మొన్నటికి మొన్న కాలేజీల శేర్తనని ఆపాచ్ఛణ పడ్తుంటే దాని కిలాసు సట్టిపికెట్లని శించి పడేశిండు. పాపమది గోడు గోడున ఏడుత్తుంటే సూల్లేక పోయిన అనుకో...
"ఇంతకీ ఎవలన్నవ్? శెల్లే?"
"గదే నవ్వా! మన శాంతక్క మొగుడు. ఇంగ కొడుకు ముచ్చెటి. గాడ్నేమో డబ్బులు బెట్టి సద్విత్తున్నడు.పరీచ్చల్ల ఎప్పుడు సున్నాలె.గాడ్ని గావురం జేసి జెడగొడ్తుర్రట."
"ఇంగ గా పొల్లనేమో బండెడు శాకిరికి బలి జేత్తుర్రు. గింత వొలపచ్చమా! శెప్పవ్వా? గట్ల చెయ్యొద్దు గదా అవ్వా? ఎంత శెప్పినా యినడట.ఏం జెయ్యాల్నో తెల్వక అల్లడం తల్లడమైతుంది."
అవును శెల్లే! కొంతమంది తాన ఎన్ని ఎత్తులు ఏశినా మారరు.ఇనుప గుగ్గిళ్ళస్మంటి బుద్ధులుంటే గిట్లనే ఉంటది శెల్లే ''
గస్మంటోళ్ళ మాటలు గట్లనే ఏడ్శినయ్ లే శెల్లే. మిన్ప గుగ్గిళ్ళ ఉడ్కుతయి గని ఇనుప గుగ్గిళ్ళు ఉడ్కుతయా శెప్పు?"
" అట్లాంటి మడుసులు శేబట్టే గిట్లాంటి శాత్రం పుట్టి ఉంటది.సూసుడేగని తినుడు ఉండదన్నట్టు మినప గుగ్గిళ్ళొతికే సూపులకే గని మేపులకు గావు శెల్లే!"
అవునా అవ్వా! మంచిగ శెప్పినవ్. ఆడివిల్లన్న, ఆడివిల్ల సద్వన్న గాళ్ళ ఆలోశన్లు ఇన్ప గుగ్గిళ్ళ లెక్క ఉంటయన్న మాట."
గదండీ సంగతి" "ఇనుప గుగ్గిళ్ళు గాని మినప గుగ్గిళ్ళు గావు" అంటే గిదే మరి.పప్పులు కందులు పెసలు శెనగలస్మంటివి ఉడుకుతయి గని ఇనుపవి ఉడకవు గద.ఇనప గుగ్గిళ్ళస్మంటోళ్ళని ఎట్ల ఉడికిచ్చ లేత్తం చెప్పుర్రి.ఓ రకంగ గాళ్ళు మూర్ఖులనే చెప్పుకోవాలి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి