మైసూరు పప్పు మైత్రేయి: --డా.. కందేపి రాణీ ప్రసాద్
 

హలో పిల్లలూ! ఈ రోజు  అమ్మాయిని చాలా దినుసులలో తయారు చేస్తున్నాను. ముఖ్యంగా మైసూరు పప్పును వాడాను. ఇంకా పెసలు, ఆవాలు, జీలకర్ర, బియ్యం కందిపప్పులను వాడాను. పెగులు, మైసూరు పప్పు ఆహారంలో ప్రోటీన్లను అందించే పప్పు దినుసులు. ఈ కందిపప్పును ఎర్ర కందిపప్పు అంటారు. ఇది మామూలు కందిపప్పు కన్నా చిన్నగా, ఎర్రగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు ఫైభర్ పుష్కలంగా ఉంటాయి. పప్పు త్వరగా ఉడుకుతుంది. దీనిని రెడ్ లెంటిల్స్ అని కూడా పిలుస్తారు. ఇంకా ‘మసూర్ దాల్’ అనే పేరు కూడా ఉన్నది. దీనిని కూడా కందిపప్పు వలె అన్ని వంటకాల్లో వాడుకుంటారు ఇది కూడా ఫాబేసి కుటుంబానికి చెందిందే దీని శాస్త్రీయనామం “లెన్స్ క్యులినారిస్”. ఇందులో వాడిన పెసలు కూడా పప్పుదినుసులే. ఇది కూడా ఫాబేసి కుటుంబానికి చెందిన మొక్కలే. దీని శాస్త్రీయ నామం “విగ్నా రేడియేటా”. ఇవి నవ ధాన్యాలలో ఒకటిగా పేరుపొందాయి భారతీయుల ఆహారంలో ముఖ్యమైన ఆహారం. వీటితో తయారయ్యే పెసరట్టు చాలా మందికి ఇష్టమైన వంటకం. వీటిని గ్రీన్ గ్రామ్, మూంగ్ దాల్ అనీ అంటారు వీటిలో పీచు పదార్థం ఎక్కవగా ఉండటం వల్ల మలబద్దకం తగ్గుతుంది. వీటిలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. బరువును తగ్గించేందుకు ఎక్కువగా తీసుకుంటారు. తక్కువ కేలరీలు ఉంటాయి. కొద్దిగా తినగానే కడుపు నిండుతుంది.
ఒక అందమైన అమ్మాయి బొమ్మను వేసుకున్నాను. చక్కగా తల దువ్వి రెండు జడలు వేశాను. జుట్టు కోసం పెసల్ని అతికించాను. తలలో పూల మాలను పెట్టాను. పూలమాలను ఆవాలతో చుట్టి మధ్యలో కందిపప్పు పెట్టాను. జడలకు బియ్యాన్ని వాడాను. గౌను కోసం మైసూరు పప్పును పెట్టాను. దీనికి మైత్రేయు అని పేరు పెట్టాను.
కామెంట్‌లు