సాంస్కృతిక, విజ్ఞాన కార్యక్రమాలను ఎప్పటికప్పుడు వినూత్న రీతిలో నిర్వహిస్తూ, ఇతరులను ప్రోత్సహించడంతో పాటు సేవా రంగంలో సూచనలు, సలహాలు అందించేందుకు "తుర్లపాటి సాంస్కృతిక విజ్ఞాన కన్సల్టెన్సీ సర్వీసెస్" (టిసికెసిఎస్) ను ఏర్పాటు చేసినట్లు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తుర్లపాటి నాగభూషణరావు తెలిపారు.
కోకాపేటలోని సంస్థ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆకాశవాణి సీనియర్ న్యూస్ రీడర్, దూరదర్శన్ ప్రయోక్త పోణంగి బాల భాస్కర్ సంస్థ లోగోను సూత్రప్రాయంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా బాల భాస్కర్ మాట్లాడుతూ, సంస్కృతిని కాపాడుతూనే జ్ఞానాన్ని పంచుతూ, సృజనాత్మకతకు దిశానిర్దేశం చేసేలా టి.సి.కె.సి.ఎస్. ఎంచుకున్న లక్ష్యం ఆదర్శప్రాయంగా ఉందని అన్నారు.
భావితరాలకు విలువైన సాంస్కృతిక, విజ్ఞాన వారసత్వాన్ని అందించడంలో టి.సి.కె.సి.ఎస్. ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.
పుస్తక ప్రచురణతో పాటు విజ్ఞాన, వినోద, సాంస్కృతిక అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ డిజైనింగ్, సూచనలు, సలహాలు, కార్యక్రమాల రూపకల్పన తదితర సేవలను సంస్థ అందిస్తుందని తుర్లపాటి నాగభూషణరావు సభకు వివరించారు.
🌸🌷🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి